ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్

  • ప్రభాస్ గురించి జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నిత్యామీనన్ సమాధానంపై అప్పట్లో దుమారం
  • ఒక్క మాటను పట్టుకుని రాద్ధాంతం చేశారన్న నిత్యామీనన్
  • ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడి
తన కెరీర్ ప్రారంభంలో ఒక హీరో గురించి అడిగిన ప్రశ్న, ఆ తర్వాత తనను ఇబ్బంది పెట్టిందని, దీంతో తాను లౌక్యంగా మాట్లాడడం నేర్చుకున్నానని ప్రముఖ సినీ నటి నిత్యామీనన్ అన్నారు. ఆమె కెరీర్ ప్రారంభంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "ప్రభాస్ ఎవరు?" అని రిప్లయ్ ఇవ్వడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఈ అంశంపై ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు.

ఆ సమయంలో తాను చాలా అమాయకంగా ఉండేదానని, ఒక్క మాటను పట్టుకుని రాద్దాంతం చేయడం తనను చాలా ఇబ్బందికి గురిచేసిందని అన్నారు. తన నిజాయతీని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఈ విషయాన్ని పెద్దది చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండడం పనికిరాదన్న విషయం అర్థమైందని వెల్లడించారు.

కొన్నిసార్లు తెలివిగా మాట్లాడటం అవసరమని తాను తెలుసుకున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు తన నిజాయతీకి అర్హులు కారని అర్థమైందని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత తాను లోకజ్ఞానాన్ని పెంచుకున్నానని అన్నారు. నాడు ప్రభాస్ అంశం కారణంగా తాను ఎంతో ఇబ్బందిపడ్డానని వాపోయారు. 

దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి, తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ఆ సమయంలో కొన్ని ఫేక్ ఫొటోలు సృష్టించి తనను మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి ఘటనలు తనకు జీవితంలో ఎంతో నేర్పాయని, అప్పటి నుంచి తాను మనుషులను అంచనా వేయడంలో చాలా మారిపోయానని వెల్లడించారు.

Nithya Menen
Prabhas
Nithya Menen Prabhas controversy
Telugu cinema
actress interview
celebrity gossip

More Telugu News